దయా సముద్ర తరంగాలు
దయా సముద్ర తరంగాలు (శృంగేరి జగద్గురు శ్రీ శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి భక్తుల అనుభవాలు) అనే పుస్తకంలో నేను నేర్చుకున్న అంశాలు -
1. 1) అపర్ణా నామం యొక్క అర్థం, ఆ నామ జపంలో ఉన్న విశిష్టత - ఆ నామం అతి గొప్పది. శివుడిని వివాహం చేసుకునేందుకు ఆకులు కూడా తినకుండా తపస్సు చేసిన అమ్మవారి నామం అది. ఇంకో రకంగా చూస్తే ఋణాల నుంచి విముక్తి కలిగించే నామం అది.
1.2) భగవంతునికి నివేదించే ప్రతిదీ చాలా చాలా శ్రద్ధగా నివేదించాలి - నైవేద్యం అయినా, పువ్వులు అయినా ... వాడిన పూలు పెట్టకూడదు ... ఇంట్లో వివిష్టమైన వ్యక్తికి, అతిథి కి ఎంత జాగ్రత్తగా భోజనం పెడతామో దేవుడికి కూడా అలాగే నైవేద్యం పెట్టాలి, మరీ వేడిగా పెట్టకూడదు.
2) అనవసరంగా మానసిక ఒత్తిడికి గురి కావద్దు, అది నిరర్థకమే కాదు - అపాయం కూడా.
3. 1) భక్తుడు అధిక ప్రసంగం చేసినా గురువులు కోపం లేకుండా ఓర్పుతో సంస్కరించ ప్రయత్నం చేస్తారు.
3.2) కోపాన్ని నియంత్రించుకోవాలంటే - నవ్వడం, గురువులను జ్ఞప్తికి తెచ్చుకోవడం చెయ్యాలి.
4) దేవునిపై నిరంతరం మనసు లగ్నం చేసినా కష్టాలు వస్తున్నాయని అనుకోవద్దు. దేవుడిపై నిజంగా ఏకాగ్రత ఉంటే కష్టాల మీదకి మనసు వెళ్ళదు. ఎప్పుడు తట్టుకోలేని కష్టం వచ్చినా - అది దేవుడి సంకల్పం అని, వాటిని ఎదుర్కునే శక్తి ని కూడా దేవుడు ఇస్తాడని అర్థం చేసుకోండి.
5) స్వామివారు కోరికలు లేనివారు, నిరంతర తృప్తి కలిగిన వారు - సన్యాసాశ్రమం స్వీకరించక మునుపు కూడా.
6) గురువుల వర్ధంతి వేడుకలు చెయ్యడం మీద గురువులకు ఎలాంటి ఆపేక్ష ఉండదు. కానీ ఆ సమయంలో జరిగే పూజలు హోమాలు వాళ్ళ ఈ ప్రపంచానికి మేలు జరుగుతుంది.
7) శరీరం ఉన్నంత వరకు సద్వినియోగం చేసుకుని భగవత్ ధ్యానంలో గడపాలి.
8) శాస్త్రోక్త విధులను నిర్వహించి మీ ధర్మాన్ని సంపాదించండి. ధార్మిక సంపదని సంపాదించి మీ కుటుంబం పట్ల మీ బాధ్యతని పూర్తి చెయ్యండి.
9) గురువుకి సలహాలు ఇచ్చే శక్తి శిష్యుడికి ఎప్పుడూ ఉండదు. భక్తి ఒక్కటే ప్రధానం.
10) గురువు ఒక మాట చెప్పాక దానికి వేరే ఇతర ప్రమాణాలు అవసరం లేదు.
11) గురువు ఒక మాట చెప్పిన తర్వాత రెండో ఆలోచన లేకుండా పాటించడమే శిష్ద్యుడి కర్తవ్యమ్.
12) శాస్త్రంలో చెప్పబడిన విషయాలకు ఒక్కొక్కరూ ఒక్కో రకమైన వ్యాఖ్యానం చేస్తూ ఉంటారు. నీ గురువు ఏమి చెప్పారో నువ్వు తూచా తప్పకుండా పాటించు. ఇతరమైనవి ఏవీ పట్టించుకోవద్దు. అలాగే ఇతరులకు ఏవీ సలహాలు ఇవ్వొద్దు.
13) ప్రతి ఒక్కరు వేరే వాళ్ళకి సలహాలు ఇవ్వడంలో ఉత్సాహం చూపిస్తారు. ప్రతి ఒక్కరికీ తాము గురువుగా ఉండాలని ఆతృత. గురువుగా ఉండాలనుకునే వారు దాని కన్నా ముందు మంచి శిష్యుడిగా ఉందటం నేర్చుకోవాలి.
14) సంతోషానికి దుఃఖానికి తావివ్వకుండా గురువు మాటను తప్పకుండా పాటించేవారు సాత్విక గుణం కలవారు. గురువు మాట విన్నాక కూడా దుఃఖంలో ఉన్నవారు రాజస స్వభావం కలవారు. గురువు శిష్యుడు దుఃఖంలో ఉండి శరీరాన్ని కష్ట పెట్టుకోవడాన్ని ఒప్పుకోరు.
15) గురువులు ఒక మాట చెప్పినప్పుడు దాని వెనక ఎంతో అంతరార్థం ఉంటుంది. గురువు మాట నచ్చక పొతే నిరాశ పడకూడదు.
Comments
Post a Comment