Posts

దయా సముద్ర తరంగాలు

 దయా సముద్ర తరంగాలు (శృంగేరి జగద్గురు శ్రీ శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి భక్తుల అనుభవాలు) అనే పుస్తకంలో నేను నేర్చుకున్న అంశాలు - 1. 1) అపర్ణా నామం యొక్క అర్థం, ఆ నామ జపంలో ఉన్న విశిష్టత - ఆ నామం అతి గొప్పది. శివుడిని వివాహం చేసుకునేందుకు ఆకులు కూడా తినకుండా తపస్సు చేసిన అమ్మవారి నామం అది. ఇంకో రకంగా చూస్తే  ఋణాల నుంచి విముక్తి కలిగించే నామం అది.  1.2) భగవంతునికి నివేదించే ప్రతిదీ చాలా చాలా శ్రద్ధగా నివేదించాలి - నైవేద్యం అయినా, పువ్వులు అయినా ... వాడిన పూలు పెట్టకూడదు ... ఇంట్లో వివిష్టమైన వ్యక్తికి, అతిథి కి ఎంత జాగ్రత్తగా భోజనం పెడతామో దేవుడికి కూడా అలాగే నైవేద్యం పెట్టాలి, మరీ వేడిగా పెట్టకూడదు.  2) అనవసరంగా మానసిక ఒత్తిడికి గురి కావద్దు, అది నిరర్థకమే కాదు - అపాయం కూడా.  3. 1) భక్తుడు అధిక ప్రసంగం చేసినా గురువులు కోపం లేకుండా ఓర్పుతో సంస్కరించ ప్రయత్నం చేస్తారు.  3.2) కోపాన్ని నియంత్రించుకోవాలంటే - నవ్వడం, గురువులను జ్ఞప్తికి తెచ్చుకోవడం చెయ్యాలి.  4) దేవునిపై నిరంతరం మనసు లగ్నం చేసినా కష్టాలు వస్తున్నాయని అనుకోవద్దు. దేవుడిపై నిజంగా ఏకాగ్ర...

గురుర్దేవో మహేశ్వరః

Image
దీపపు కాంతిలో పటంలో ఉన్న దుర్గా మాత చూపు సజీవంగా కనిపిస్తోంది.  ఆ నవ్వు జన్మ జన్మల దుఃఖాన్ని బాపేంత దివ్యంగా ఉంది.  నా ఇల్లు, నా కుటుంబం, నా పూజ గది - ఇవేవీ నాకు కనిపించడం లేదు. మొగలి పరిమళపు అగరొత్తులు, దీపారాధన వెలుగులో బెజవాడ దుర్గమ్మ చిరునవ్వు మాత్రమే కనిపిస్తున్నాయి. ఆ చూపు నుంచి ఒక వెలుతురు తదేకంగా ప్రసరించి నా వైపు నెమ్మదిగా కదులుతూ వచ్చి నన్ను తాకింది, నా ఒళ్ళు జలదరించింది.  "ఏవండీ, మధ్యాహ్నానికి కూరగాయలు తేవాలి" అని నా భార్య పిలుపు. ఈ లోకంలోకి వచ్చాను.  "నేనెంత అదృష్ట వంతుడిని. అతి సామాన్య గృహస్థుని. ఒకానొక సమయంలో నా వ్యక్తిగత జీవితం, వృత్తి జీవితం అన్నీ భయంకరంగా ఉన్న సమయంలో - దేవుడిని ప్రార్థించడం, పూజలు చెయ్యడం అప్రయత్నంగా మొదలు పెట్టాను. చాగంటి కోటేశ్వర రావు గారు, సామవేదం షణ్ముఖ శర్మ గారు లాంటి మహానుభావుల ప్రవచనాలు వింటూ సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకున్నాను. అప్పటి నుంచి నేను అదే పనిగా అమ్మవారిని, పరమ శివుడిని ఆరాధిస్తున్నాను.  నాకిప్పుడు ముప్ఫయ్ ఎనిమిదేళ్లు. నా 28 వ ఏట నుంచి ఈ ఆరాధన కొనసాగుతూ ఉంది. ఎన్నో భగవంతుడి మహిమలను చవిచూశాను నేను...

ప్రతి జీవుడు యశోదయే

Image
       రేపల్లెలో యశోదమ్మ చిన్ని కృష్ణుడిని బయటకు వెళ్ళద్దు ఇంట్లోనే ఉండమని బుజ్జగిస్తుంటే - అల్లరి వాడైన కృష్ణయ్య తన మాటలతో యశోదమ్మని మాయ చేసిన ఒక చిలిపి తమిళ గీతం ఇది. ఈ గీతం బయటకు మాత్రం అల్లరి కృష్ణయ్య గడుసుతనాన్ని చూపిస్తోంది కానీ, లోపల ఏదో తత్త్వం ఉందని నాకు అనిపించి నేను రాసుకున్న అర్థం ఇది.    నా గురువుల విషయంలో నాకున్న అనుభూతులు, అనుభవాలు, నేను నేర్చుకున్న పాఠాలు - చాగంటి వారు, సామవేదం వారు లాంటి ఎందరో మహానుభావులు ఇచ్చిన భక్తి-ప్రేమల మేళవింపు నేను రాసుకున్న ఈ తత్వానికి ఆధారం.    ఈ మొత్తం భావాలలో ఎక్కడన్నా నా అహంకారం తొంగిచూస్తూ ఉంటే - జగన్మాత నాకు తగిన బుద్ధిని ఇచ్చి నన్ను సన్మార్గంలోకి మళ్ళించుగాక.    ఈ క్రింద వీడియో యొక్క అన్ని హక్కులు గౌరవనీయులైన కులదీప్ పాయ్ గారివి. నేను ఆయన వీడియో చూసి మైమరచి స్ఫూర్తి ని పొందాను కాబట్టి - నా రాతకి మరింత అర్థాన్ని ఇవ్వడం కోసం ఆయన వీడియో ని లింక్ చేశాను.        పల్లవి: యశోదమ్మ : బుజ్జి గోపాలుడా ! బయటకు వెళ్ళద్దు నాయనా ! నా మాట విను....